ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. వీడియో ఇదిగో!

07-06-2022 Tue 13:28 | Andhra
  • వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన జగన్
  • 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ
  • రైతన్నకు ప్రతి అడుగులో అండగా ఉన్నామన్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరినీ అలరించారు. వైయస్సార్ యంత్ర సేవా పథకాన్ని ఈరోజు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు గ్రూపుతో కలిపి ఆయన ట్రాక్టర్ నడిపారు. అనంతరం రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేశారు. దీంతో పాటు 5,260 రైతు గ్రూప్ బ్యాంక్ ఖాతాలకు రూ. 175 కోట్ల సబ్సిడీని జగన్ బటన్ నొక్కి జమ చేశారు.  

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రాంభించామని చెప్పారు. రైతన్నకు ప్రతి అడుగులో అండగా ఉంటున్నామని తెలిపారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉన్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రూ. 2,016 కోట్లతో 10,750 వైయస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. 3,800 కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

చంద్రబాబు హయాంలో రైతులకు అరకొర ట్రాక్టర్లను ఇచ్చారని జగన్ విమర్శించారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోళ్లలో కుంభకోణాలు జరిగాయని చెప్పారు. రైతుల ఇష్టం మేరకే ట్రాక్టర్లను కొంటున్నామని తెలిపారు.
JaganYSRCPYSR Yantra Seva

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more